జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విశాఖ జిల్లా అరకులో రైతులు పాదయాత్ర నిర్వహించారు. మండలంలో సుమారు 300 మంది రైతులు 400 ఎకరాల్లో సాగు చేసిన బజ్జి మిర్చిని... లాక్డౌన్లో వ్యాపారులు కొనుగోలు చేయని కారణంగా తీవ్రంగా నష్టపోయారు.
పంటకు పరిహారం చెల్లిస్తామని పేర్కొంటూ అధికారులు సర్వే నిర్వహించారు. నెలలు గడుస్తున్నా పరిహారం అందని కారణంగా సీపీఎం ఆధ్వర్యంలో రైతులు సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు.