నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపాలని... కడప కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయుల అధ్యక్షతన...'నల్లమలను కాపాడుకుందాం-ప్రజలను రక్షించుకుందాం' అనే నినాదంతో ఆందోళన నిర్వహించారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే...అడవులను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలని... లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన - కడప కలెక్ట
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. తవ్వకాలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా... సీపీఎం నాయకుల ఆందోళన