రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపేందుకు సీపీఐ పార్టీ 13 జిల్లాల్లో పర్యటనలు చేస్తోంది. ఇందులో భాగంగా కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన ఇల్లూరి లక్ష్మీదేవి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. ఆమె అప్పుల బాధ భరించలేక 2018 జనవరి 25వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి ఇంతవరకు మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరుగుతుండటం చాలా బాధాకరమని రామకృష్ణ అన్నారు. ఆత్మహత్యలతో సమస్యకు పరిష్కారం కాదని.. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ రైతుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. కేంద్రం రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా న్యాయం చేయాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల గురించి వివరిస్తామన్నారు. అంతేగాక 7 లక్షల రూపాయల నగదు అందించాలని, బ్యాంకులలో ఉన్న అప్పును ఒకేసారి రద్దు చేయాలని, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని జగన్మోహన్రెడ్డిని కోరుతామని రామకృష్ణ అన్నారు.
ముత్తుకూరు రైతు కుటుంబానికి సీపీఐ పరామర్శ - CPI State Secretary Ramakrishna
కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు కుటుంబాన్ని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.

CPI State Secretary Ramakrishna visited Kadapa district as part of a review of suicidal farmer families in the state.