ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప స్టీల్ ప్లాంట్ కోసం.. సీపీఐ రామకృష్ణ నేటి నుంచి పాదయాత్ర - Walk for steel industry

CPI State Secretary Ramakrishna Padayatra for Kadapa Steel Plant: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి మూడేళ్లు గడిచింది.. కానీ ఎటువంటి పనులు ప్రారంభం కాలేదని వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర సీపీఐ వర్గాలు మండిపడ్డాయి. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేటి నుంచి పాదయాత్ర చేయనున్నారు.

CPI State Secretary Ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Dec 9, 2022, 10:47 AM IST

కడప స్టీల్ ప్లాంట్ కోసం.. సీపీఐ రామకృష్ణ నేటి నుంచి పాదయాత్ర

CPI State Secretary Ramakrishna Padayatra for Kadapa Steel Plant: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. నేటి నుంచి పాదయాత్ర చేయనున్నారు. జిల్లా పోలీసులు పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో.. రామకృష్ట హైకోర్టు ద్వారా అనుమతి తీసుకున్నారు. జమ్మలమడుగు సమీపంలో.. మూడేళ్ల కిందట సీఎం జగన్ ఉక్కు పరిశ్రమకు వేసిన శిలాఫలకం వద్ద నుంచి.. కడప కలెక్టరేట్ వరకు ఐదురోజుల పాటు పాదయాత్ర సాగుతుందని.. సీపీఐ వర్గాలు తెలిపాయి.

జమ్మలమడుగు ప్రాంతంలో మూడు చోట్ల ఉక్కు పరిశ్రమకు శిలాఫలకాలు వేసినా.. ఒక్కటి కూడా ముందుకు సాగలేదు. మూడేళ్ల కిందట ముఖ్యమంత్రి జగన్ జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద.. వైఎస్​ఆర్​ స్టీల్ కార్పొరేషన్​కు శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇవాళ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మూడేళ్ల కిందట సీఎం జగన్ వేసిన శిలాఫలకం వద్ద నుంచే... పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రభుత్వం కుట్రతో అడ్డంకులు సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సీపీఐ పార్టీ హెచ్చరించింది. రామకృష్ణ చేస్తున్న పాదయాత్రకు.. వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీల మద్దతు లభించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details