CPI Ramakrishna On PRC: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెండున్నరేళ్లుగా చాలా సంయమనంతో ఉన్నారని..వారికి ఓపిక నశించటం వల్లే ఇప్పుడు ఉద్యమబాట పట్టారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చే విధంగా కొందరు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని రామకృష్ణ హితవు పలికారు.