విశాఖలో వైకాపా మంత్రులు కార్మికులకు మద్దుతు తెలుపుతుంటే... సీఎం కూడా విజయవాడలో ఆందోళన చేపట్టాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ కోసం యువమోర్చా ఆధ్వర్యంలో గతంలో ఉద్యమం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ఇపుడు నోరు మెదపకుంటే ఆయన్ని తెలుగు ప్రజలు క్షమించరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారన్నారు. పార్లమెంటులో గులాంనబీ ఆజాద్ వీడ్కోలు సభలో ప్రధాని ముసలి కన్నీరు కార్చారు తప్పితే.. నిజంగా బాధపడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల రాజకీయ చర్చలు చేయడానికి జగన్ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.