ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులు, వినియోగదారులను మోసం చేసేందుకే వ్యవసాయ బిల్లులు' - kadapa latest news

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకస్తూ... కడపలో సీపీఐ నేతలు ఆందోళన చేశారు. రైతులకు హాని కలిగించే విధంగా ఉన్న ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

CPI leaders protest in kadapa to demand reduce agricultural bills
కడపలో సీపీఐ నేతలు ఆందోళన

By

Published : Sep 22, 2020, 9:18 PM IST

రైతులను, వినియోగదారులను మోసం చేసేందుకే కేంద్రం... వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేశారు. మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వారికి అప్పగించేందుకే ఈ బిల్లులను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీటిని రద్దు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details