ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శంకుస్థాపన చేసి నాలుగేళ్లైనా.. అలుగు నిర్మాణమే కాలేదు' - కడపజిల్లాలో సీపీఐ నాయకుల నిరసన వార్తలు

కడప జిల్లా కోటరెడ్డి కూడలి వద్ద సీపీఐ కార్యకర్తలు ధర్నా చేశారు. సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపనకు నాలుగో ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన తెలిపారు. ఇంత కాలమైనా.. నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని తప్పుబట్టారు.

cpi leaders protest for siddeswaram  project at kadapa
కడపజిల్లాలో సీపీఐ నాయకుల నిరసన

By

Published : May 31, 2020, 11:23 PM IST

కడప జిల్లా కోటరెడ్డి కూడలి వద్ద సీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని.. ఇప్పటికైనా అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.

రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. రాయలసీమ ప్రాజెక్టులకు కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీవో 203ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details