ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప స్టీల్​ ప్లాంట్​ కోసం.. అనుమతివ్వకపోయినా పాదయాత్ర చేస్తాం: సీపీఐ

CPI agitation for Kadapa Steel Plant: కడప ఉక్కు పరిశ్రమ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపటి నుంచి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించలేదు. అయినప్పటికీ జమ్మలమడుగు వద్ద సీఎం జగన్ వేసిన శిలాఫలకం నుంచి రామకృష్ణ పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య వెల్లడించారు.

CPI  padayatra
CPI padayatra

By

Published : Dec 8, 2022, 4:39 PM IST

CPI padayatra for Kadapa steel plant: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపటి నుంచి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసులు అధికారికంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. సీపీఐ నాయకుల బృందం ఇవాళ ఎస్పీ అన్బురాజన్ కలిసి వినతిపత్రం అందజేసినా.. ఆయన అధికారికంగా ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. అయినప్పటికీ జమ్మలమడుగు వద్ద సీఎం జగన్ వేసిన శిలాఫలకం నుంచి రామకృష్ణ పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య వెల్లడించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మైదుకూరు మీదుగా కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే అక్కడికక్కడే దీక్షలు కొనసాగిస్తామని సీపీఐ నేతలు స్పష్టం చేశారు. తమ నాయకుడి పాదయాత్రకు అన్ని పార్టీల మద్దతు ఉందని ఈశ్వరయ్య తెలిపారు.

ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

'ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న పాదయాత్రకు అనుమతి కోసం ఎస్పీ అనుమతి కోసం వచ్చాం. ప్రజలకు ఇబ్బందులు కలగనంతవరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్పీ తెలిపారు. పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 18 ప్రకారం.. తమకు ఉన్న హక్కును వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. రేపటి నుంచి సీపీఐ నేతలందరూ పాదయాత్రలో పాల్గొంటారు. మాకు మద్దతుగా వివిధ పార్టీ నేతలు సైతం పాదయాత్రలో పాల్గొంటారు. మా విన్నపానికి ఎస్పీ సానుకులంగా ఉన్నారని అనుకుంటున్నాం. మా పాదయాత్రను అడ్డుకోవాలని జగన్ ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. జిల్లాలో జరిగే పాదయాత్రలో ప్రతిచోట సభలు పెడుతాము. ఈ అయిదు రోజుల పాటు జరగబోయే పాదయాత్రలో వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు పాల్గొంటారు.'- ఈశ్వరయ్య,సీపీఐరాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details