కడప జిల్లాలో ఈ నెల 8న కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీ హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఎంపిక చేసిన 108 వైద్య కేంద్రాల్లో 10 మందికి చొప్పున వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక, సామాజిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు.. రిమ్స్ ఆవరణలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ ఫ్రెంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనున్నామని చెప్పారు. అలాగే ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, పులివెందులలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ.. నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కడపలో ఈ నెల 8న కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్
కడప జిల్లాలో ఎంపిక చేసిన 108 వైద్య కేంద్రాల్లో ఈ నెల 8న కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీ హరికిరణ్ పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఆయా కేంద్రాల్లో 10 మందికి చొప్పున.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సినేషన్ చేయనున్నామని తెలిపారు.
కడపలో ఈ నెల 8న కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమం