కడప జిల్లా వేంపల్లిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగుతున్న ఆందోళనకర పరిస్థితులపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వేంపల్లి ప్రత్యేక అధికారి శాంతమ్మ, రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించారు. ఇకపై వేంపల్లిలో ఆంక్షలు కఠినతరం చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రజలు నిబంధనలు పాటించాలని.. బయటకు వస్తే తప్పకుండా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. తిరిగి లాక్డౌన్ పరిస్థితి రాకుండా సహకరించాలన్నారు.