కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ కొవిడ్ 19 టాస్క్ఫోర్స్ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగరాజు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు, రెవెన్యూశాఖ, మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. కరోనా మహమ్మారి నివారణ చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
కమలాపురంలో అధికారులతో కొవిడ్ అధికారి భేటీ - covid officer meet in kamalapuram
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేక అధికారి నాగరాజు అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొవిడ్ నియంత్రణ జాగ్రత్తలపై ఆరా తీశారు. కరోనా నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
కమలాపురంలో.. అధికారులతో కొవిడ్ అధికారి భేటీ కమలాపురంలో.. అధికారులతో కొవిడ్ అధికారి భేటీ
కరోనా నివారణ చర్యలు, కొవిడ్ సోకినవారు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్న ఆయన.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఇదీ చదవండి :వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడొద్దని ఈసీ చెప్పింది: రఘురామకృష్ణరాజు