కడప జిల్లాలో ఎంపిక చేసిన 108 వైద్య కేంద్రాలలో.. కోవిడ్-19 డ్రై రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 10 మందికి చొప్పున టీకా వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకునే వారికి.. ముందుగా వైద్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీకా వేసిన అరగంటసేపు పరిశీలన గదిలో ఉంచుతామని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిసిన తరువాతే ఇంటికి పంపిస్తామని వైద్యులు పేర్కొన్నారు.
జిల్లాలోని 108 కేంద్రాల్లో కొవిడ్-19 డ్రైరన్ కార్యక్రమం - కడప జిల్లా వార్తలు
కడప జిల్లాలో కొవిడ్-19 డ్రైరన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన 108వైద్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టీకా వేయించుకునే వారికి ముందుగా.. వైద్యులు వారికి సూచనలు చేస్తున్నారు.
కడపలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్