ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో కొవిడ్-19 ట్రూనాట్ పరీక్షా కేంద్రం - రాజంపేటలో కొవిడ్-19 ట్రూనాట్ పరీక్షా కేంద్రం

కడప జిల్లా రాజంపేటలో కొవిడ్-19 ట్రూనాట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఇక్కడ పరీక్షించనున్నారు.

రాజంపేటలో కొవిడ్-19 ట్రూనాట్ పరీక్షా కేంద్రం
రాజంపేటలో కొవిడ్-19 ట్రూనాట్ పరీక్షా కేంద్రం

By

Published : May 3, 2020, 7:42 PM IST

కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిలో కొవిడ్ -19 ట్రూనాట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొబైల్ యూనిట్ల ద్వారా సేకరించిన అనుమానితుల రక్తం నమూనాలను మాత్రమే ఇక్కడ పరీక్షిస్తారని అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో నేరుగా ఎవరి నుంచి రక్త నమూనాలను తీసుకోబోమని స్పష్టం చేశారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన 2 యంత్ర పరికరాల ద్వారా రోజుకు 40 నుంచి 50 పరీక్షలు చేస్తామన్నారు. ఇందు కోసం ఐదుగురు ల్యాబ్ సాంకేతిక నిపుణులను, ఇద్దరు డేటా ఆపరేటర్లను, ఒక సహాయకుడిని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ నియమించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details