ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో చంద్రబాబు బర్త్‌డే నిర్వహించారని కేసులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం - అక్రమ కేసులు పెట్టారని వైఎస్ఆర్ జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం

Couple suicide attempt: వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో.. భార్యాభర్తలు ఆత్మాహత్యాయత్నం చేశారు. చంద్రబాబు పుట్టినరోజు నాడు తాము కేక్ కట్ చేసినందుకు అక్రమకేసులు పెడుతున్నారంటూ.. రామాంజనేయులు, కృష్ణవేణి అనే దంపతులు ఆరోపించారు. బాధితులను.. కుటుంబసభ్యులు మొదట వేంపల్లె ఆస్పత్రి, తర్వాత కడప రిమ్స్​కు తరలించారు. ఇటీవల బనాయించిన కేసుతో కలిపి.. వీరిపై గతంలో మరో రెండు కేసులు పెట్టారని వెల్లడించారు.

Couple suicide attempt for ycp leader harassment in pulivendula
దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 29, 2022, 10:32 AM IST

పులివెందులలో చంద్రబాబు బర్త్‌డే నిర్వహించారని కేసులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Couple suicide attempt: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైకాపా నేతల అక్రమ కేసులతో మనస్తాపం చెందిన తెదేపాకు చెందిన దంపతులు గురువారం ఆత్మహత్యకు యత్నించారు. చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో తెదేపా కార్యకర్తలు రామాంజనేయులు, కృష్ణవేణి దంపతులు ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబునాయుడి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. ఇది గిట్టని స్థానిక వైకాపా నేత సురేష్‌.. తన భార్య పద్మజ పేరిట దంపతులపై అక్రమ కేసులు బనాయించినట్లు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

పోలీసుస్టేషన్‌కు రావాలంటూ సచివాలయం మహిళా కానిస్టేబుల్‌ ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిపై గతంలోనూ రెండు అక్రమ కేసులు పెట్టారని, తరచూ పోలీసులు ఇంటికి రావడాన్ని అవమానంగా భావించి.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెబుతున్నారు. బాధితులకు వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, తర్వాత కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

రామాంజనేయులు దంపతులు బలవన్మరణానికి యత్నించడం నేరమని.. ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. వీరి చర్యలతో పద్మజ ఆత్మహత్యాయత్నం చేశారని, ఆ ఘటనతో కేసు అవుతుందని భయపడి వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని వివరించారు. వారి కుటుంబ గొడవలు కూడా కారణం కావొచ్చని పేర్కొన్నారు.

పోలీసులపై ప్రైవేటు కేసు: ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి తెదేపా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ ఘటనను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో వైకాపా ఆగడాలను అడ్డుకోవడానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

Mistake in Hallticket: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థికి శాపం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details