Allotted Land Issue in Kadapa: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని బీడీ కాలనీలో నివాసం ఉంటున్న జయమ్మకు గతంలో ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇచ్చింది. అయితే కొందరు అధికారులు.. ఎమ్మార్వో, ఆర్ఐ, వీఆర్వోలు.. గ్రామంలోని రాజకీయ నాయకుల ఒత్తిడితో తమకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటున్నారని జయమ్మ ఆరోపించారు. అక్కడ అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తున్నట్లు.. అందుకోసమే తమ స్థలం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. ఎప్పుడో ఇచ్చిన ఇంటి పట్టాను.. ఇలా వెనక్కి తీసుకోవడం ఏమిటని జయమ్మ ప్రశ్నించింది. తాము జీవనం సాగించడమే కష్టంగా ఉండటంతో.. ఇల్లు కట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆదాం గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాడని.. ఇప్పుడు తమ్ముడు ఇల్లు కట్టిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలికి తెదేపా నాయకులు మద్దతుగా నిలిచారు. అధికారులతో మాట్లాడి.. అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కుంటున్నారు.. ఓ కుటుంబం ఆవేదన
Allotted land: ఆమెకు గతంలో ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కెేటాయించింది. అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంది.. అయితే గత కొద్ది సంవత్సరాలుగా భర్త మంచానికే పరిమితమవ్వడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ లోపే అ స్థలంలో ప్రభుత్వాధికారులు అంగన్వాడీని నిర్మించాలనుకున్నారు. ఎప్పటినుంచో మాకు ఇచ్చిన ఈ పట్టాను ఇలా వెనక్కి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది. విషయం తెలుసుకున్న ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి ఆమె సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి దృష్టికి జయమ్మ తన సమస్యను తీసుకువెళ్లింది. విషయం తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వ స్థలాన్ని మీరు అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించగా.. తాము అమ్ముకోలేదని ఇల్లు నిర్మించుకుంటుంటే అధికారులు అడ్డుకుంటున్నారని ఆమె తెలిపింది. ధర్మచంద్రారెడ్డి మాట్లాడుతూ మీకు ఎలాంటి అన్యాయం జరగదని.. అవసరమైతే తానే ఓ కాంట్రాక్టర్ను మాట్లాడి ఇల్లు కట్టి తాళం చేతికి ఇస్తానని వారికి భరోసా ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్ముకుని.. తిరిగి అధికారులను బెదిరించే ప్రయత్నం చేయడం తప్పని ధర్మచంద్రారెడ్డి తెలిపారు.