ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

current shock: విద్యుదాఘాతంతో దంపతులు మృతి - విద్యుదాఘాతంతో భార్యభర్తలు మృతి

విద్యుదాఘాతంతో భార్యభర్తలిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. ఆరేసిన దుస్తులు తీసే సమయంలో ప్రమాదం జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

current shock
current shock

By

Published : Oct 6, 2021, 8:12 AM IST

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దవరం దళితవాడలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో దంపతులిద్దరు ఒకేసారి కన్నుమూశారు. విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్టు తీగకు మరో స్తంభానికి తీగను కట్టి దుస్తులు ఆరేశారు. వాటిని తీసే క్రమంలో ఆ తీగకు విద్యుత్ సరఫరా కావటంతో భార్యభర్తలు వెంకటలక్ష్మి, గురవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులకు నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. వారి ఇద్దరు మగపిల్లలకు వివాహం చేశారు. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details