కడప జిల్లాలో వివహబంధంతో ఒక్కటైన చెన్నూరుబ్రహ్మణవీధికి చెందిన శ్రీరములురాజు, సుబ్బలక్ష్మమ్మ అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారందరిని ప్రయోజకులనుచేశారు. అందరూ కలసి ఆనందంగా జీవించే వారు. ఇటీవలె సుబ్బలక్షుమ్మ ఆనారోగ్యానికి గురైంది. గుండెకు శస్త్రచికిత్స చేశారు. ఇదే క్రమంలో భర్త కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత రెండురోజుల క్రితం సుబ్బలక్ష్మమ్మకు చిన్నపాటి అనారోగ్య సమస్యకు గురికావడంతో ఇంటి వద్దనే వైద్యం అందించారు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించిడంతో కడప నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. భార్య మరణ వార్త వినగానే భర్త శ్రీరాములు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులంతా శోకసముద్రంలో మునిగారు. ఒకే రోజు భార్యాభర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం - మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
శ్రీరాములురాజు, సుబ్బలక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఎంతో హాయిగా వీరి జీవితం సాగిపోతోంది అనుకుంటుండగా.. భార్య సుబ్బలక్ష్మమ్మకు అనారోగ్యం చేసింది. చికిత్స పొందుతూ మరణించింది. భార్య మరణవార్త విన్న శ్రీరాములు రాజు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఉన్నచోటే కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
couple death