ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్​లో.. దంపతుల ఆత్మహత్యాయత్నం - నందవరం పోలీస్​స్టేషన్ లో దంపతుల ఆత్మహత్యాయత్నం

నందవరం పోలీస్ స్టేషన్​లో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత.. పది రోజులు క్రితం పొలానికి వెళ్లగా ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. రెండు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ దంపతులు ఆరోపించారు. ఆవేదనతో ప్రాణం తీసుకోవడానికి యత్నించారు.

Couple commits suicide at Nandavaram police station
Couple commits suicide at Nandavaram police station

By

Published : Jul 3, 2021, 3:42 PM IST

కర్నూలు జిల్లా నందవరం పోలీసు స్టేషన్​లో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టించింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత.. పది రోజుల క్రితం పొలానికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మొదట ఆ వివాహిత భర్త వెళ్లి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

పట్టించుకోకపోవడంతో మళ్లీ తన భార్యను తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. అత్యాచార యత్నానికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుకోకపోవడం.. అతని తరఫు వారే దాడికి పాల్పడడంతో మనస్థాపం చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స కోసం వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details