Couple Suicide: వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వేపరాల గ్రామానికి చెందిన పల్లా గోవర్ధన్, పల్లా వరలక్ష్మి దంపతులు మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. సోమవారం ఉదయం తమ ఇద్దరు పిల్లలను కట్ట పైన ఉంచి.. నీళ్లలోకి దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను గమనించిన పోలీసులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా వరలక్ష్మి మృతదేహాన్ని వెలికి తీశారు. గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవన్మరణానికి యత్నించి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు పిల్లలను ఆనకట్టపై ఉంచి.. జలాశయంలోకి దూకిన దంపతులు - వైఎస్ఆర్ జిల్లా
Couple Suicide: ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. వారిని ఆనకట్టపై ఉంచి.. దంపతులు ఇద్దరూ జలాశయంలో దూకారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో చోటుచేసుకుంది. భార్య మృతదేహం దొరకగా.. భర్త కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆత్మహత్యాయత్నం