ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం.. కోట్లు విలువైన వాహనాలకు తుప్పు - కడప చెత్తసేకరణ వాహనాల వార్తలు

అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల విలువైన వాహనాలు వృథాగా మూలన పడున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ లబ్ధిదారులకు అందించకుండానే.. పాడైపోతున్నాయి. కర్నూలు జిల్లాలో కోట్ల విలువ చేసే చెత్తసేకరణ ఆటోలు, ట్రాక్టర్‌, జేసీబీలు..పనికిరాకుండా పోతున్నాయి.

corporation vehicles destroying
corporation vehicles destroying

By

Published : Aug 8, 2021, 9:44 AM IST

అధికారుల నిర్లక్ష్యం.. కోట్లు విలువ చేసే వాహనాలు తుప్పు

కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ కోసం 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ లబ్ధిదారులకు ఆటోలు మంజూరు చేశారు. ఒక్కోపంచాయతీకి ఒక్కో ఆటో కేటాయించారు. ఒక్కో మండలానికి ఒక్కో జేసీబీ - ట్రాక్టర్‌ను కేటాయించారు. ఒక్కో ఆటో ధర 2.80లక్షలు కాగా ఇందులో 60శాతం సబ్సిడీ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఆయా గ్రామపంచాయతీలు ప్రతి నెల 10 వేల రూపాయలు అద్దె రూపంలో చెల్లించాలి. ఒకవైపు లబ్ధిదారులకు పంచకపోవడం, మరోవైపు ఆయా గ్రామ పంచాయతీల నిధుల లేమితో..చెత్తసేకరణ ఆటోలు తీసుకోలేదు.

ఒక్కపైసా చెల్లించలేదు..

జిల్లాలో అక్కడక్కడా కొందరు లబ్ధిదారులు ఆటోలను తీసుకుని చెత్తసేకరిస్తున్నా చాలా కాలంగా వారికి ఒక్కపైసా అద్దె చెల్లించలేదు. ప్రతి మండలానికి ఒక ట్రాక్టర్‌, జేసీబీ వాహనాలను మంజూరు చేశారు. ఒక్కో వాహనం విలువ 15 లక్షలు. ఎస్సీ లబ్ధిదారులకు 60శాతం సబ్సిడీ పోనూ ప్రతి నెలా 70 వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. వీటికి కూడా ఆయా మండలాల్లో నిధులు లేవని చెబుతున్నారు. దీంతో 292 ఈ-ఆటోలు, 30 ట్రాక్టర్, జేసీబీలు, 35 మినీ జేసీబీలు ఎస్సీ కార్పొరేషన్‌ ఆవరణలో తప్పుపడుతున్నాయి.

ప్రజాధనాన్ని వృథా చేయటంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న ప్రజాసంఘాలు.. వెంటనే వాటిని లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:krmb, grmb: 'బోర్డుల సమావేశం వాయిదా వేయలేం'.. మరి తెలంగాణ హాజరవుతుందా?

ABOUT THE AUTHOR

...view details