ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లావాసికి కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు - Blood to Live NGO latest news update

విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డును కడపకు చెందిన బ్లడ్ టు లివ్ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పవన్ కుమార్​కు అందజేశారు. కరోనా కష్ట కాలంలో రక్తదానంపై అలుపెరగని సేవ చేసినందుకుగాను ఈ ఆవార్డు ఇచ్చినట్లు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

Corona Warrior International Award
కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు అందజేత

By

Published : Oct 20, 2020, 9:52 PM IST


కడపలో బ్లడ్ టు లివ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పవన్ కుమార్​కు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. హైదరాబాద్​లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. కరోనా కష్ట కాలంలో రక్తదానంపై అలుపెరగని సేవ చేస్తూ కొన్ని వేల మందిని కాపాడుతున్నందుకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఎంతోమందికి రక్తదానంపై అవగాహన కల్పించి వారిని రక్తదాతలుగా మారుస్తున్నందుకు గాను ఈ ఇంటర్నేషనల్ అవార్డ్ పవన్​కు లభించిందన్నారు. ఈ సందర్భంగా సత్యవేలు రాంబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో మరింత ఉత్సహంగా ప్రజలకు సేవ చేస్తానని పవన్ పేర్కొన్నారు. ఈ అవార్డును ప్రతి రక్తదాతకు అంకితం ఇస్తున్నట్లు తెలియజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details