ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టీకా వేయించుకున్న పాత్రికేయులు

కడప జిల్లాలో పాత్రికేయులు కరోనా టీకా వేయించుకున్నారు. ప్రజలందరూ నిర్భయంగా కొవిడ్ వాక్సినేషన్ వేయించుకొవాలని పాత్రికేయులు పిలుపునిచ్చారు. వాక్సినేషన్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి.. అవగాహన కల్పించడంలో మీడియా కూడా తనవంతు పాత్ర పోషించిదన్నారు.

corona vaccinated fried journalists in kadapa district
కరోనా టీకా వేయించుకున్న పాత్రికేయులు

By

Published : Mar 17, 2021, 8:51 AM IST

కడపలోని రిమ్స్ డెంటల్ ఆసుపత్రిలో పాత్రికేయులకు కొవిడ్ వాక్సినేషన్ వేశారు. పలు మండలాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వాక్సినేషన్ చేయించుకున్నారు. ఇందులో 45 ఏళ్ల పైబడిన వారందరికి ఉచితంగా టీకా వేశారు. అదే వయస్సులో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారందరికీ వ్యాక్సిన్​ వేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్ వాక్సిన్ తీసుకోవాలని పాత్రికేయులు కోరారు.

మూడో విడతలో భాగంగా.. పాత్రికేయులకు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్​ను ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు పి.రామసుబ్బారెడ్డి కోరారు. అడిగిన వెంటనే ప్రత్యేక కేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కలెక్టర్​కు పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details