ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెండింగ్ వేతనాలు విడుదల కోసం స్టాఫ్ నర్సుల నిరసన - 9 నెలల పెండింగ్ జీతాల కోసం కడపలో స్టాఫ్ నర్సుల జీతాలు

కుటుంబాలు, పిల్లలకు దూరంగా 9 నెలలపాటు కరోనా రోగులకు సేవలందించినా జీతాలు ఇవ్వలేదంటూ.. కడపలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కల్పించుకుని తమకు వేతనాలు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు.

staff nurses protest in kadapa
పెండింగ్ వేతనాల కోసం కడపలో స్టాఫ్ నర్సుల ధర్నా

By

Published : Jan 7, 2021, 4:55 PM IST

కరోనా సమయంలో తొమ్మిది నెలల పాటు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించినా.. ఒక్క నెలకూ జీతం ఇవ్వలేదని కడపలో స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

నెలల తరబడి కుటుంబాలకు దూరమై, పిల్లలను చూడకుండా పనిచేసినా.. తమ కష్టాన్ని గుర్తించలేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారని కంటతడి పెట్టుకున్నారు. డీఎంహెచ్​వో కార్యాలయానికి వెళ్తే డీసీహెచ్ఎస్ కార్యాలయానికి.. అక్కడికి వెళ్తే డీఎంహెచ్​వోకు వెళ్లమని తిప్పారని వాపోయారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details