ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లా కోర్టు ప్రాంగణంలో థర్మల్​ గన్​తో పరీక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా అనుమానిత కేసులు బయట పడుతున్న తరుణంలో... కడప జిల్లాలో ముందు జాగ్రత్తగా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కోర్టుకు వచ్చిన వారికి థర్మల్​ గన్​తో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

corona tests at kadapa court premises
కడప జిల్లా కోర్టు ప్రాంగణంలో కరోనా పరీక్షలు

By

Published : Mar 18, 2020, 4:36 PM IST

కడప జిల్లా కోర్టు ప్రాంగణంలో కరోనా పరీక్షలు

కడప జిల్లాలోని న్యాయస్థానం ఆవరణలో కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి థర్మల్​ గన్​తో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు గుర్తించే థర్మల్ పరికరంతో పరీక్షలు నిర్వహించిన అనంతరం లోపలికి పంపుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ఎవరినైనా గుర్తిస్తే రిమ్స్ ఐసోలేషన్ వార్డుకు తరలిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే జిల్లా కోర్టు ప్రాంగణంలో కరోనా పరీక్షలు నిర్వహించడం శుభ పరిణామం అని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఆర్టీసీ స్క్రాప్​ జోన్​లో అగ్నిప్రమాదం... స్థానికుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details