ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముమ్మరంగా కరోనా వైద్య పరీక్షలు - కడపలో కరోనా పరీక్షలు

కడప జిల్లాలో రెడ్ జోన్ పరిధిలో ర్యాండమ్​ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలోని పోలీసులు, రెవెన్యు, వైద్య సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. కడప డీఎస్పీ సూర్యనారాయణ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

corona random tests in kadapa
కడపలో కరోనా పరీక్షలు

By

Published : Apr 20, 2020, 8:42 PM IST

కడప జిల్లాలో రెడ్ జోన్ పరిధిలో ర్యాండమ్ కరోనా వైద్య పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెడ్ జోన్ పరిధిలోని ప్రతి ఇంటి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో పనిచేసే పోలీసులు, రెవెన్యు, వైద్య సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కడప నకాష్ వీధిలో నిర్వహిస్తున్న ర్యాండమ్ కరోనా పరీక్షలను కడప డీఎస్పీ సూర్యనారాయణ పరిశీలించారు. స్వయంగా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎవరూ భయపడకుండా ఉండేందుకు తానే స్వయంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించు కుంటున్నానని డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు.

కడపలో కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details