ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పంజా.. హెడ్​ కానిస్టేబుల్​కు కరోనా - corona updates in prodhutur

కడప జిల్లా ప్రొద్దుటూరులో హెడ్​ కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో పోలీసు శాఖ భయాందోళనకు గురవుతోంది. బాధితులు పెరుగుతుండ‌టంతో అధికార యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్తమైంది.

corona positive to head conistable at prodhutur
కరోనా పంజా.. హెడ్​కానిస్టేబుల్​కు కరోనా

By

Published : Apr 25, 2020, 6:46 PM IST

కడ‌ప జిల్లా ప్రొద్దుటూరుపై క‌రోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో అత్య‌ధికంగా ప్రొద్దుటూరులోనే క‌రోనా బాధితులు ఉండ‌టం క‌ల‌వ‌ర పెడుతోంది. తాజాగా మ‌రో మూడు కేసులు న‌మోదుకాగా... అందులో హెడ్‌కానిస్టేబుల్‌కు క‌రోనా పాజిటివ్ సోకిన‌ట్లు అధికారులు నిర్ధరించారు. దీంతో మొత్తంగా కేసుల న‌మోదు సంఖ్య 25కు చేర‌గా.. అందులో ప‌ది మంది కోలుకుని ఇళ్ల‌కు వెళ్లారు. హెడ్ కానిస్టేబుల్‌కు క‌రోనా సోక‌డంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పెరుగుతుండ‌టంతో అధికార యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్తమైంది. ఇప్ప‌టికే వైర‌స్ కేసులు న‌మోదైన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్ర‌క‌టించిన పోలీసులు... లాక్‌డౌన్‌ను మ‌రింత కట్టుదిట్టం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కంటికి క‌నిపించని క‌రోనా వ‌ణుకు పుట్టిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details