కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో కరోనా కలకలం సృష్టించింది. బద్వేలుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి మండలంలోని గ్రామాల్లో ప్రార్థనలు చేసినట్టు తేలగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలో కరోనా బాధితుడు తిరిగిన ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. అనంతరం కొంతమందిని బద్వేల్ క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలు ఎవరు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
కరోనా పాజిటివ్.. అంతకు ముందు సామూహిక ప్రార్థనలు? - porumamilla corona cases news
కడప జిల్లాలో కరోనా భయాందోళనలు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. బద్వేలుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని ఫలితంగా రాగా.. అంతకుముందు అతను పోరుమామిళ్ల మండలంలో ప్రార్థనలకు హాజరైనట్టు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై.. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలించారు.
పోరుమామిళ్లలో కరోనా కలకలం