ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - kadapa district corona news
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా అయనకు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కరోనా సోకింది. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఇవాళ హోలిస్టిక్ ఆస్పత్రిలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొనడం చర్చనీయాంశమైంది.