కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామంలో పెళ్లి కుమారుడికి కరోనా సోకింది. మూడు రోజుల క్రితం వరుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా... గురువారం ఫలితాలు వచ్చాయి. వివాహం అనంతరం బంధువులు నెల్లూరు జిల్లా గూడూరు వెళ్లారు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పెళ్లి కుమారునికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు నుంచి వెంటనే తిరిగి రావాలని అధికారులు ఫోన్ చేయటంతో పెళ్లింట్లో ఆందోళన నెలకొంది.