కడప జిల్లా ప్రొద్దుటూరులో రోజూ పదుల సంఖ్యలో వైరస్ బారిన పడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కంటికి కనిపించని మహమ్మారి... ప్రజల్ని కమ్మేస్తోంది. ఎవరికి వైరస్ ఉందో... ఎవరికి లేదో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. తాజాగా ప్రొద్దుటూరులో మరో 26 కేసులు నమోదయ్యాయి. అధికారులు మాత్రం... అవసరమైతే తప్పా బయటకి రావద్దని హెచ్చరిస్తున్నారు.
ప్రొద్దుటూరులో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - ప్రొద్దుటూరులో కరోనా కేసులు వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా 26 కేసులు నమోదయ్యాయి. ఓ పక్క అధికారులు కరోనా వ్యాప్తి నివారణకు హెచ్చరికలు చేస్తున్నా... రోజురోజుకు పెరుగుతున్న వైరస్ వ్యాప్తి తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
ప్రొద్దుటూరులో పెరుగుతున్న పాజిటివ్ కేసులు