ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగునూరులో ఒకరికి కరోనా.. అంతటా ఆందోళన - కడప జిల్లా తాజా కరోనా వార్తలు

గొడుగునూరు గ్రామానికి చెన్నై నుంచి వచ్చిన భార్యాభర్తల్లో... భార్యకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులను వైద్య పరీక్షలకు అధికారులు కడపకు పంపించారు. గ్రామస్థులంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

corona positive case find in godugunuru in kadapa district
గొడుగునూరులోని ఓ జంటలో.. భార్యకు సోకిన కరోనా

By

Published : May 16, 2020, 9:39 AM IST

కడప జిల్లాలో కరోనా వ్యాధి పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరిస్తోంది. బద్వేలు పట్టణం నుంచి గొడుగునూరు గ్రామానికి ఈ వ్యాధి విస్తరించింది. చెన్నై నుంచి వచ్చిన దంపతుల్లో.. భార్యకు కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు. ఈమె కుటుంబ సభ్యులతో పాటు 20 మందిని వైద్య పరీక్షల నిమిత్తం కడపకు పంపించారు. మరో 40 మందిని ఆమె కలిసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.

బాధితురాలు.. తన సొంత గ్రామంతో పాటు బద్వేలు పట్టణ ప్రాంతాలకూ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా గ్రామంలో రాకపోకలు నిలిపివేశారు. గ్రామస్థులంతా లాక్​డౌన్​లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.​ పట్టణంలో గతంలో నలుగురికి కరోనా సోకగా.. వారంతా కోలుకున్నారు. తాజాగా 5వ కేసు నమోదు కావడంపై ప్రజల్లో భయాందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details