ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకిన మహిళ మృతదేహం.. ఎట్టకేలకు ఖననం! - కడప జిల్లాలో కరోనాతో మహిళ మృతి తాజా వార్తలు

పుణేలో కేన్సర్​ తో మరణించిన కడప జిల్లా వాసికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమె శరీరాన్ని ఖననం చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. చివరికి.. దగ్గరలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెను ఖననం చేశారు. మృతదేహంతో వచ్చిన డ్రైవర్లు, ఐదుగురు కుటుంబ సభ్యులను... అధికారులు క్వారంటైన్​కు తరలించారు.

corona patient deadbody buried in kadapa tribal area
కరోనా సోకిన మహిళ మృతదేహాన్ని ఖననం చేసిన అధికారులు

By

Published : May 20, 2020, 7:52 AM IST

మహారాష్ట్రలోని పుణేలో కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన నందలూరు మండలం ఆడపూరుకు చెందిన మహిళకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను ఖననం చేయడానికి ప్రయత్నించగా... స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కడప జిల్లా నందలూరుకు సమీపంలోని చెయ్యరు నదిలో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేయగా... స్థానికులు అభ్యంతరం చెప్పారు.

చివరికి.. స్థానిక అటవీ ప్రాంతంలోని 3 కిలోమీటర్ల దూరంలో ఎట్టకేలకు ఖననం చేశారు. అక్కడ కూడా కొంతమంది రైతులు అభ్యంతరం తెలుపగా... అధికారులు సర్దిచెప్పారు. కాగా.. కరోనా సోకిన మహిళ మృతదేహంతో పాటు వచ్చిన అంబులెన్స్​లోని ఇద్దరు డ్రైవర్లు, ఐదుగురు కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా కళాశాలలోని క్వారంటైన్​కు తరలించమని తహసీల్దార్​ రవి శంకర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details