కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం(Corona cases) రేపింది. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. అప్రమత్తమైన ఎంఈవో మిగిలిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
Corona: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం... నలుగురు ఉపాధ్యాయులకు వైరస్ - corona news in Chintalamadugupalle
కడప జిల్లా(kadapa district)లోని చింతలమడుగుపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం(Corona) రేపింది. నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకటం(4 teachers infected corona)తో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు నాలుగు రోజులు సెలవు ఇస్తున్నట్లు ఎంఈవో వీరారెడ్డి ప్రకటించారు.
corona
ఈ పరీక్షల్లో మరో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ తేలింది. దాంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు నాలుగు రోజులు సెలవు ఇస్తున్నట్లు ఎంఈవో వీరారెడ్డి ప్రకటించారు. చింతలమడుగుపల్లె ప్రాథమిక పాఠశాలలో రెండు వందలకు పైగా విద్యార్థులు ఉండగా.. 8 మంది ఉపాధ్యాయులున్నారు.
ఇదీ చదవండి:TTD: తిరుమలలో దళారులపై కేసు నమోదు