కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బద్వేలులో ఈరోజు మరో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసులు 31కు చేరుకున్నాయి. తాజాగా బద్వేల్ పట్టణంలో మహబూబ్‌నగర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితుడు గోపవరం మండలంలోని రాసాయిపేటకు మత ప్రార్థనలు నిమిత్తం వెళ్లి వచ్చారు. అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా కరుణ వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కడపలో కరోనా కలవరం.. బద్వేలులో మరో పాజిటివ్ కేసు - కడపలో కరోనా కేసులు
కడప జిల్లాలో ఈరోజు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బద్వేల్ పట్టణంలో మహబూబ్‌నగర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది.
బద్వేలులో మరో పాజిటివ్ కేసు