కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అయిదుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య విస్తరణాధికారి మార్టిన్ లూథర్ తెలిపారు. మండల పరిధిలో ఈ నెల 17వ తేదీన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 77 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కోవిడ్ -19 స్వాబ్ ( ట్రూ నాట్ ) పరీక్షల్లో పెట్రోలింగ్ విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్ కు, డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థికి, చీమకుర్తి లో పనిచేసే మరో వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించాయని తెలిపారు.
పెట్రోలింగ్ నిర్వహించే కానిస్టేబుల్ ను, డిగ్రీ విద్యార్థిని... రైల్వే కోడూరు నుంచి కడప ఫాతిమా కళాశాల కేంద్రానికి పంపించామన్నారు. చీమకుర్తి లో పనిచేస్తున్న వ్యక్తి... తిరిగి అక్కడికే వెళ్ళిపోగా అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అతనికి అక్కడే చికిత్స చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.