కడప జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. ఆదివారం కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 794కు చేరింది. 362 మంది కరోనా నుంచి కోలుకున్నారు. విదేశాల నుంచి జిల్లాకు 6886 మంది వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 12 మంది కరోనా బారిన పడ్డారు. వీరు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
జిల్లాలో కొత్త కేసులు