కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు 19, పొరుమామిల్ల 10, పులివెందుల 5, వల్లూరు 3, మైలవరం 3, కడప, జమ్మలమడుగులో ఒక కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి వచ్చినట్లు తెలియజేశారు. ఇవాళ 15 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరందరికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా రూ.2 వేలు అందజేశారు.
జిల్లాలో పెరుగుతున్న కరోనా బాధితులు - kadapa district latest corona updates
జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 43 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కేసుల సంఖ్య 528కి చేరగా... 182 మంది కోలుకున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చేతుల మీదుగా నగదు అందజేత