కరోనా మహమ్మారి మారుమూల ప్రాంతాలను వీడడం లేదు. రోజురోజుకు రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోతున్నారు. సోమవారం ఒక్కరోజే రాయచోటిలో 66 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా రాయచోటి ఉలిక్కిపడింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం కొవిడ్ బస్సు సంజీవని ద్వారా 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో రాయచోటి పట్టణానికి చెందిన 52 మందితో పాటు.. గ్రామీణ ప్రాంతాల పరిధిలో మరో 10 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పట్టణంలో కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణ పరిధిలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పట్టణ సీఐ జి.రాజా తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా.. స్వీయ నిర్భంధం పాటించాలని పురపాలక కమిషనర్ రాంబాబు తెలిపారు.
రాయచోటిలో ఒక్కరోజే 66 కరోనా పాజిటివ్ కేసులు - కడపజిల్లా కరోనా కేసుల సంఖ్య
కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కడప జిల్లా రాయచోటిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో రాయచోటిలో 66 మందికి కరోనా నిర్థరణ అయింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
corona cases