ప్రొద్దుటూరులో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 22 కేసులు - ప్రొద్దుటూరులో కరోనా విజృంభన
కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రొద్దుటూరులో కరోనా విజృంభన..ఒక్కరోజే 22 కేసులు !
కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 22 పాజిటివ్ కేసులు నమోదు కావటం స్థానికులను కలవరపెడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్దే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరుతున్నారు. మాస్కులు ధరించటంతోపాటు భౌతిక దూరం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.