కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 17 కేసులు వెలుగుచూడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖలో పనిచేస్తున్న ఐదుగురికి పాజిటివ్ నిర్ధరణ కాగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే నలుగురికి వైరస్ సోకింది. మరో 8 కేసులు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
మొత్తం ప్రొద్దుటూరులో కేసుల సంఖ్య 204కు చేరింది. పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. నిబంధనలు పాటించాలని సూచించారు.