కడప జిల్లా రాయచోటిలో కరోనా కలకలం రేపుతోంది. రాయచోటి పురపాలికలో ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడగా... తాజాగా శనివారం మరో ఇద్దరు వ్యాపారులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నారు. బాధిత వ్యక్తులను కడపలోని ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించారు. పట్టణంలోని 25వ వార్డులోని ఓ బట్టల దుకాణం వ్యాపారికి, మాసాపేటకు చెందిన మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడుకి వైరస్ నిర్ధారణ అయింది.
రాయచోటిలో కరోనా కలకలం... అప్రమత్తమైన అధికారులు - రాయచోటిలో కరోనా కలకలం
కడప జిల్లా రాయచోటి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం మరో రెండు కరోనా కేసులు నమోదు కాగా... అప్రమత్తమైన అధికారులు వారిని కడప కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
రాయచోటిలో కరోనా కలకలం...అప్రమత్తమైన అధికారులు !
అధికారులు అప్రమత్తమై... కంసలవీధి, గాంధీ బజార్, మాసాపేట ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లోని రహదారులు మూవేసి రాకపోకలు నిలువరించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక వాహనాల్లో కడపకు తరలించారు.