కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65కి చేరింది. ఏడు కేసుల్లో ప్రొద్దుటూరు-4, ఎర్రగుంట్ల-2, చెన్నూరులో ఒక కేసు నమోదైంది. అత్యధికంగా ప్రొద్దుటూరులో 29 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లపైనే అధికారులు దృష్టి సారించి వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.
కడప జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - కడపలో లాక్డౌన్ అమలు
కడప జిల్లాలో ఇప్పటివరకు 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు.

corona cases in kadapa