కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా 15కు పెరగటంతో కడప జిల్లా ఉలిక్కిపడింది. అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టారు. బద్వేల్ పట్టణంలోని నూర్ భాషా కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతని కుటుంబ సభ్యులు ఇటీవల పోరుమామిళ్ల మండలం గానుగపెంటలో మూడు రోజులు ప్రార్థనలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గ్రామంలోని 12 మందిని వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఇటీవల దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి అతను వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బద్వేల్ పట్టణంలోని నూర్ భాషా కాలనీతో పాటు మరో రెండు వీధులను అధికారులు మూసివేశారు. ఎవరు ఆ వీధుల్లో రాకపోకలు సాగించవద్దని నిషేధాజ్ఞలు జారీ చేసి... రసాయన ద్రావకాన్ని పిచికారి చేశారు.
కడపలో కరోనా కలకలం.. యంత్రాంగం అప్రమత్తం - కడపలో కరోనా కేసులు
కడపజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బద్వేలు పట్టణంలోని పలు కాలనీలను రెడ్ జోన్లుగా ప్రకటించి రసాయన ద్రావకాన్ని పిచికారి చేశారు.
కడపలో కరోనా కేసుల కలకలం