కడపజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప నగరంలోని బీకేఎం వీధిలోనే ఈ 6 కేసులు వెలుగుచూశాయి. ఇదే వీధిలో ఇదివరకే 8 మందికి కొవిడ్ సోకగా.. ప్రస్తుతం వచ్చిన 6 కూడా వారి కుటుంబ సభ్యులవే అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96కు చేరింది. వీటిలో 40 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 56 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కడపలో నేడు 6 కరోనా కేసులు... జిల్లాలో మొత్తం 96 - కడపలో కరోనా వార్తలు
కడప జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నేడు మరో 6 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కడప బీకేఎం వీధిలో ఒకే కుటుంబసభ్యుల్లో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి.
కడపలో నేడు 6 కరోనా కేసులు... జిల్లాలో మొత్తం 96
జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, వేంపల్లె, చెన్నూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, పుల్లంపేట, సీకే దిన్నె ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప బీకేఎం వీధిలో పెరుగుతున్న కేసుల్లో.. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వ్యాధి సోకిందని వైద్యులు చెబుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి..'కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'