కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో కరోనా కలకలం రేగింది. పట్టణంలోని అమ్మవారిశాల, కొత్త వీధి, శ్రీనివాస్ నగర్, మామిళ్ళపల్లి గ్రామాలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఒకేరోజు నలుగురికి పాజిటివ్ రావడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు.
పోరుమామిళ్ల మండలంలో నాలుగు కరోనా కేసులు - పోరుమామిళ్ల మండలంలో నలుగురికి కరోనా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. కడప జిల్లాలో పలు గ్రామాలకు చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది.
corona cases