కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరట కల్గించే అంశం. గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోనే అడపా దడపా కేసులు వెలుగుచూస్తున్నాయి.
మిగిలిన పది ప్రాంతాల్లో 20 రోజుల నుంచి కేసులు నమోదు కాకపోవడంపై ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 97 పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. 52 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 16,449 నమూనాలు సేకరించగా 1398 మంది ఫలితాలు రావాల్సి ఉంది.