కడప జిల్లా మైదుకూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతన్నాయి. ఇప్పటి వరకు స్థానిక పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 131 కేసులు నమోదు కాగా... పురపాలకలో 35 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కరోనా కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా చేసి ఆంక్షలను కఠినతరం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజలు బయటకు రావడం వల్లే కేసులు పెరుగుతున్నాయని డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.