ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడప జిల్లాలో మరింత పటిష్టంగా లాక్​డౌన్

By

Published : May 6, 2020, 4:56 PM IST

కడపలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకిన కారణంగా.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు.

corona case in kadapa
corona case in kadapa

కడపలో కారోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో లాక్​డౌన్ ను మరింత పటిష్టం చేశామని ఎస్పీ అన్బు రాజన్ స్పష్టం చేశారు. అయినా వాహనదారులు రోడ్లపైకి వివిధ రకాల కారణాలతో వస్తూనే ఉన్నారు. వారందరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వైద్యం, పారిశుద్ధ్యం, బ్యాంక్ ఉద్యోగులను తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.

కడప బీకేఎన్ వీధిలోని ఓ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకగా.. ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ గా ప్రకటించారు. ఈ మేరకు రెడ్ జోన్ తో పాటు ఆరెంజ్, గ్రీన్ జోన్ తదితర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించి కరోనాను నిర్మూలించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే 94407 96900 ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details