ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణదాతలు: ఆపదలో ఆదుకున్న 'రక్షకులు' - కడపలో చిన్నారుల ప్రాణాలు కాపాడిన పోలీసులు

కరోనా కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తూ వైద్యులతో పాటు నిర్విరామంగా శ్రమిస్తున్న పోలీసులు...ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటంలోనూ అంతే ఔదార్యాన్ని చూపుతున్నారు. ఏడు నెలలకే జన్మించిన కవల పిల్లలకు కడప రిమ్స్ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవటంతో మౌలిక వసతులున్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.

కవలల ప్రాణాలు కాపాడిన పోలీసులు
కవలల ప్రాణాలు కాపాడిన పోలీసులు

By

Published : Apr 9, 2020, 8:01 AM IST

కవలల ప్రాణాలు కాపాడిన పోలీసులు

లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు...ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలోనూ అంతే ఔదార్యం చూపుతున్నారు. కడప రిమ్స్‌లో ఏడునెలలకే పుట్టిన కవల శిశువులను... మౌలిక సదుపాయాలున్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలిచేలా సాయపడ్డారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా గర్భం దాల్చింది. రిమ్స్‌లో ఏడో నెలలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. రిమ్స్‌లో సరైన పరికరాలు లేవని, ఇక్కడే ఉంచితే శిశువులు బతకటం కష్టమని చెప్పటంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు... వెంటనే ఎస్పీ అన్బురాజ్‌కు ఫోన్‌ చేశారు. నగరంలో ఆసుపత్రులన్నీ మూసి ఉన్నాయని, ఏదైనా చేసి తమ పిల్లలను బతికించాలని కోరారు. ఎస్పీ వెంటనే డీఎస్పీ సూర్యనారాయణకు ఫోన్‌ చేశారు. మూసిఉన్న ప్రైవేటు ఆసుపత్రిని తెరిపించి, సిబ్బందికి సమాచారమిచ్చి.... తల్లీబిడ్డలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details